సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్
దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
నన్నడిగి తలితండ్రి కన్నారా..ఆ ఆ ఆ
నన్నడిగి తలితండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియక పోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
***********************************
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ (2)
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ (2)
జరిగిన నాడే తెలియును కొన్నీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ !
No comments:
Post a Comment