March 04, 2010

వియ్యాలవారి కయ్యాలు (2007)

సంగీతం:
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సునీత, రాజు


నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

నీ వేడి కౌగిళ్ళూ..
లోలోన తాకిళ్ళూ..
వెచ్చంగ వెయ్యేళ్ళు..
లాలించవా..నా ప్రాణమా !

I just wanna be close to you

నీ గుండెల్లో.. చోటెంతుందో..ఆ నింగి చెప్పిందిలే
నీ మాటల్లో.. మత్తెందుదో..ఈ గాలి చెప్పిందిలే

ఏకమౌతున్న ఈలోయ చెప్పింది..హాయి ఎంతుందనీ
విచ్చుకుంటున్న ఈపూలు మౌనంగా...
నాకు చెప్పాయి మనసంత నువ్వేననీ..

నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

I just wanna be close to you

నీతో ఉంటే..నీరెండైనా..వెన్నెలౌతుందిలే
నీతోడుంటే ఏ రేయైనా..వేకువౌతుందిలే

నువ్వు నా సొంతమౌతుంటే..నా శ్వాస వెల్లువౌతుందిలే
జంటగా నిన్ను చేరాక నా ఈడూ
కోటిజన్మాలనే కోరుకుంటుందిలే

నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

నీ వేడి కౌగిళ్ళూ..
లోలోన తాకిళ్ళూ..
వెచ్చంగ వెయ్యేళ్ళు..
లాలించవా..నా ప్రాణమా !

తులసి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: సాగర్, చిత్ర


నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే..క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం

అడుగునౌతాను..నీ వెంట నేనూ..తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునౌతాను..ఇకపైన నేనూ..బాధలో నిన్నిలా తడవనీకా

నిన్నొదిలి క్షణమైన అసలుండలేను..చిరునవ్వునౌతాను పెదవంచునా..
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే..తొలిసిగ్గు నేనవ్వనా !

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం

హా..వెన్నెలౌతాను..ప్రతి రేయి నేను..చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను..నీలోన నేను..ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ..నేనుండిపోతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదుటిపైనా..వస్తాను చిరుగాలిలా !

మున్నా (2007)

సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: కందికొండ
గానం: సాధనా సర్గం, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్


మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా..నా చిత్రం చిత్రించెయినా..
కనుపాపైపోనా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే

కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండీ అన్నీ మరిచా
హో నీలో నిండీ అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నీ గుందె చప్పుడులోనా
నా ప్రాణం నింపానమ్మా..నిను చేరానమ్మా !

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా

March 03, 2010

మంత్రిగారి వియ్యంకుడు (1983)




సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, జానకి

ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో .. తెర చాటులలో

ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో

నవ్వు .. చిరునవ్వు .. విరబూసే పొన్నలా
ఆడు .. నడయాడు .. పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో .. ప్రణయాలే పాటల్లో

నీ చూపులే నిట్టూర్పులై .. నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై .. నీ ఊపిరే నా ఆయువై
సాగే .. తీగసాగే .. రేగిపోయే .. లేత ఆశల కౌగిట

ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో

చిలకా .. గోరింకా .. కలబోసీ కోరికా
పలికే .. వలపంతా .. మనదేలే ప్రేమికా
దడపుట్టే పాటల్లో .. నీ దాగుడు మూతల్లో

నవ్విందిలే బృందావనీ .. నా తోడుగా ఉన్నావని
ఊగే .. తనువులూగే .. వణకసాగే .. రాసలీలలు ఆడగ

ఏమని నే .. మరి పాడుదునో
తొలకరిలో .. తొలి అల్లరిలో .. మన అల్లికలో
ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో

January 07, 2010

ఓం శాంతి


సంగీతం: ఇళయరాజా
గానం: కునాల్ గంజావాలా, సునిధి చౌహాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్


చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
జంటగా జంటగా నువ్వు కలిసాకా
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాకా
ఊగుతూ ఊగుతూ ఈ ఊహలే ..
ఉలికి పడుతుంటే ఓ హో హొ హో .. మదికి కుదురేదే ఓ హో హొ హో

చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ

నూరేళ్ళ వలపు కధా .. ఇపుడు అది మొదలు కదా
రోజుకో జన్మనే చూపుతుందా
లోలోన కలల సుధా .. కనులలో కురిసినదా
చూపులో కాంతులే నింపుతుందా

నడకలకు తెలియదు దూరం .. నీకు తెలుసా
నవ్వులకు లేదిక బంధం .. ఏంటి వరసా

పదపదమని .. ఈ ప్రతిక్షణముని
తరమకు ఈ వేళా .. ఆగనీ !

చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
జంటగా జంటగా నువ్వు కలిసాకా
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాకా
ఊగుతూ ఊగుతూ ఈ ఊహలే ..
ఉలికి పడుతుంటే ఓ హో హొ హో .. మదికి కుదురేదే ఓ హో హొ హో

చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ

మేఘాలు మెరిపు వలా .. మనసుపై విసిరెనిలా
తీయనీ తలపులే తుళ్ళిపడవా
రాగాల చురుకు అలా .. పరుగులను తడిమెనిలా
మాటగా మాటలే బయటపడవా

ఎవరికీ హాయే లేదూ ఇంతవరకూ ..
చివరి ఊపిరిలో కూడా హాయి మనకూ ..

మనసొక సగం .. తనువొక సగం
చెరిసగమవుతున్నాం .. ఇద్దరం !

చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ


**************************

Sad Version:

చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
ఎదకి భారమే ఎందుకమ్మా చీటికీ మాటికీ
జంటలో జంటలో నువ్వు విడిపోతే
ఇంతగా ఇంతగా నవ్వు కరువైపోతే
ఆగదే ఆగదే నా పాదమే ..
వెతకమంటుందే నీ ప్రేమనే ..వెలగవంటుందే నువ్వు లేకనే