March 30, 2009

స్వాగతం

సంగీతం: ఆర్.పి.పట్నాయక్
గానం: కార్తీక్, చిత్ర



మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా
చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా
చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా
ఎదలోతుల్లో ఆనందమా !


మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా మౌనమా !


నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా


వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా


Few say It’s Lust..
Few say It’s Love..
For me It’s You..Only You !


భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన
నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ
మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన
నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా


జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా

దేవా

సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: కార్తీక్




ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే
మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..ప్రెమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ

తోటలోని పూవులు అన్నీ పోటీ పడి నీ కూడినవే
ఆకాశాన జాబిలి కూడా నీకే భయపడి దాగినదే
అందం చందం కొత్తగ ఏదో బంధం వేసి పోయినదే
నిన్నే నిన్నే తలచిన వేళ ఆగని తలపు రేగినదే


మగువా నీ నడకల్లో కలహంసే కదిలినదే
చెలియా నీ నవ్వుల్లో హరివిల్లే మెరిసినదే
మనసైన పిల్లే వస్తే మదిలోన ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ


ఎండాకాలం వెన్నెల జల్లై చెలియా నన్ను తడిపినదే
వానాకాలం చలిమంటల్లే వెచ్చగ నన్ను రేపినదే
మగువా మగువా నీ సహవాసం నన్నే కొత్తగ మార్చినదే
సఖియా సఖియా కొంటెగ మనసే వీడని బంధం వేసినదే


పలికే నీ మాటలన్నీ నే విన్న వేదాలా
ఎదలోని తలపులన్నీ ఆ నింగి దీపాలా
వరసైన పిల్లే వస్తే వరదల్లే ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే

మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..నా న నా న నా న నా !

అమ్మాయి బాగుంది

సంగీతం: శ్రీలేఖ
గానం: కార్తీక్



"ఏయ్ సత్య ! నువు చాల అందం గా ఉంటావు.
నిజం చెప్పనా?
నీ టేస్టు నా టేస్టు ఒకటే సత్యా! "


"ఏయ్ శివా..కొయ్ కొయ్ కొయ్ కొయ్ ! "

"హహ .. ప్రామిస్ ! "

నిజమే చెబుతున్నా..నువ్వంటే ఇష్ఠమని…నువ్వే నా ప్రాణమని
I love you ఓ సత్యా
నిజమే చెబుతున్నా..నువ్వంటే ఇష్ఠమని…నువ్వే నా ప్రాణమని
I love you ఓ సత్యా


నిను చూస్తుంటే..No eating
నీతో ఉంటే..No drinking
కొత్తగ ఉన్నది ఈ thinking
చెలియా నీకై నే waiting
ఊరించుతావే ఓ ప్రియతమా !


I just love you love you love you O baby
Tell me tell me tell me you love me
I am so crazy crazy for your love !


"ఏంట్రా నీ గోల ! చెప్పరా ! "

ఇద్దరిదీ ఒకటే టేస్టు..ముందేదో అనుకున్నట్టు
అందం లో అందరికన్నా ఆమే ఎవరెస్టూ
తను ఏదో అంటున్నట్టు..నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఏంటీ కనికట్టూ


ఈ రోజు ఈ హాయి బాగుందిలే
ఆకాశం నా చేతులకే అందేస్తున్నట్టు


ఓ చెలియా నిన్ను చూడాలనుంది..
నీతో మాటలాడాలనుంది..
ఇపుడే మనసు చేజారిపోతోందీ !


నిజమే చెబుతున్నా..నువ్వంటే ఇష్ఠమని…నువ్వే నా ప్రాణమని
I love you ఓ సత్యా !


రోజూలా వేకువ రాదు..రాత్రైనా వెన్నెల రాదు
చెలియా నువు కనబడకుంటే ఆనందం రాదూ
నా కంటికి నిదురే రాదు..ఇంకేమీ గుర్తుకు రాదు
నీ నవ్వుల సడి వింటుంటే అలుపైనా రాదూ


తొలిసారి నాలోన తుళ్ళింతలే..
నాకోసం నువు పరుగున రావే అల్లరి చినుకల్లే !


ఓ చెలియా నిన్ను చూడాలనుంది..
నీతో మాటలాడాలనుంది..
ఇపుడే మనసు చేజారిపోతోందీ !


నిజమే చెబుతున్నా..నువ్వంటే ఇష్ఠమని…నువ్వే నా ప్రాణమని
I love you ఓ సత్యా !


నిజమే చెబుతున్నా..ఏంటీ?
నువ్వంటే ఇష్ఠమని…అచ్చా !
నువ్వే నా ప్రాణమని
I love you ఓ సత్యా !


నిను చూస్తుంటే...No eating
నీతో ఉంటే..No drinking
కొత్తగ ఉన్నది ఈ thinking
చెలియా నీకై నే waiting
ఊరించుతావే ఓ ప్రియతమా


I just love you love you love you O baby
Tell me tell me tell me you love me
I am so crazy crazy for your love !
I just love you love you love you O baby
Tell me tell me tell me you love me
I am so crazy crazy for your love !
Crazy ! Come on Siva !

ఒంటరి


సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఎస్.పి.చరణ్, కల్పన




చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !

పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా !
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా !

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !

గుండెలయలో..ఓ ఓ ధీంతధిరనా
ఎన్ని కధలో..ప్రేమవలనా
హాయి అలలో..ఓ ఓ ఊయలవనా
రేయినదిలో.. జాబిలవనా

నీ ప్రేమలోనే మేలుకుంటున్నా
మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా !

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా

వెంటనడిచే.. ఓ ఓ నీడననుకో
జంటనడిపే .. జాడననుకో
పూలు పరిచే .. ఓ ఓ దారిననుకో
నిన్ను కలిసే .. బంధమనుకో

నా ప్రేమలోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్థమేనన్నా
ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా !

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !

పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా !
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా !

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది
ప్రేమైనా !

**********************************************

గానం: హేమచంద్ర, మాళవిక


అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ

తనువంతా పులకిస్తున్నది..చిగురాకై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నది..మనసు ఎందుకో మరీ !

నీలాగే నాకూ ఉన్నది..ఏదేదో అయిపోతున్నది
నా ప్రాణం నువ్వంటున్నది..మనసు ఎందుకే ప్రియా మరి మరి !

అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ

లేత పెదవుల తీపి తడీ..మొదటి ముద్దుకు ఉలికిపడీ మేలుకున్నదీ
ఎడమవైపున గుండెసడీ..ఎదురుగా నీ పిలుపు వినీ వెల్లువైనదీ

తొలి వెన్నెలంటే తెలిపిందీ..నీ జతలో చెలిమీ
తొలి వేకువంటె తెలిసిందీ..నీ చెయ్యే తడిమీ

అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ

కనులు చూసిన తొలివరమూ..కలలు కోరిన కలవరమూ నిన్నలేదిదీ
చిలిపి సిగ్గుల పరిచయమూ..కొంటె నవ్వుల పరిమళమూ మత్తుగున్నదీ

మన మధ్య వాలి చిరుగాలి..నలిగిందే పాపం
పరువాల లాలి చెలరేగీ..చెరిగిందే దూరం

అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ

విజయం

సంగీతం: శ్రీలేఖ
గానం: కార్తీక్



నిజమేనా..నిజమేనా..నే విన్నది నిజమేనా
నిజమేనా..నిజమేనా..నువ్వన్నది నిజమేనా


Yahooo .. I'm in love !

నిజమేనా..నిజమేనా..నే విన్నది నిజమేనా
నిజమేనా..నిజమేనా..నువ్వన్నది నిజమేనా
కనుపాప దాచుకున్నా..కధలన్ని ఈ క్షణానా...ఎదురై నిలిచి పిలిచేనా !


Oh baby baby baby I love u
baby baby wanna be with u


ఆశలలో అలాపన..జాబిలికే వినిపించనా..
ఊహలలో ఆరాధనా కౌగిలికే చూపించనా..
చెలీ చెలీ అని పిలవనా..మహా వరం అని తలవనా
సరే అని జత కలవనా..స్వయం వరం ఇది తెలుసునా
అనుమానం తీరేలా నిను ఓ సారిలా తాకనా !


నిజమేనా..
నిజమేలే .. నువు విన్నది నిజమేలే
నిజమేలే..నిజమేలే ..నేనన్నది నిజమేలే


ఈ నిముషం ఏం కోరినా.. కానుకగా అందించనా
నా హృదయం శృతి మించినా.. ఆపవు గా ఏం చేసినా
తయా రయా కద ముద్దుగా..ముఖా ముఖి మురిపించగా
అయోమయం కద కొద్దిగా.. ఏకా ఎకి మరి పెంచగా
ఉన్న దూరం మరి కరిగేలా నను ప్రేమించవా బుద్దిగా !

నిజమేనా..నిజమేనా..నువ్వన్నది నిజమేనా
నిజమేలే..నిజమేలే ..నేనన్నది నిజమేలే
కనుపాప దాచుకున్నా..కధలన్ని ఈ క్షణానా...ఎదురై నిలిచి పిలిచేనా !