January 07, 2009

ప్రేమ

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం



ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !


ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !



శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా !



ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !



నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా !



ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !



ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

నీ స్నేహం !

సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్



వేయి కన్నులతో హ్మ్ హ్మ్ హ్మ్..తెరచాటు దాటి చేరదా నీ స్నేహం !


వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా .. కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా .. మన్నించి అందుకోవ నేస్తమా !



ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా .. చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కాననీ .. ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటె న్యాయమా



ఒక్కసారి … మ్మ్మ్ … ఒక్కసారి … లా ల లా ల …
ఒక్కసారి ఐనా చేయి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా !



వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిముషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో .. వెతికేది నీలోని నన్నేననీ !



వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా .. కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా .. మన్నించి అందుకోవ నేస్తమా !



***************************************************


గానం: కె.కె


ఊరుకో హృదయమా .. ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా .. బయటపడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !



చూపూలో శూన్యమే పెంచుతూ ఉన్నదీ .. జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నదీ .. జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఈ కంటిదో మమత ఈ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి



చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !



దేహమే వేరుగా .. స్నేహమే పేరుగా .. మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా .. ప్రేమనే పెంచగా .. అంకితం చేయనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా



చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !

ధం (Dhum)

సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: హరిహరన్, నందిత



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా

వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా


నువ్వున్నది నాకోసం .. నేనే నీకోసంలా .. నిలిచే మన ప్రేమలా
నువు లేని ప్రతి నిముషం .. ఎదలోని ఒక గాయంలా .. కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమా .. పరువపు పూలవానలే
ఇరువురి వలపు వంతెనే .. సకలం ప్రేమ సొంతమే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా



I love you .. I love you .. I love you .. I love you .. I love you !


నిదురంటు మటు మాయం .. కుదురంటూ కరువే
ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం .. ప్రతి ఊసూ మైకం
ప్రతి చూపు పులకింతలే
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమా .. తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమా .. కలిగిన వేళ హాయిలే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ


చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా !

January 06, 2009

నచ్చావులే ! (2008)

సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల

గానం: రంజిత్

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా (2)

ఎదురొచ్చే వాసంతం .. అవుతుందే నా సొంతం
ఎదనిండా ఆనందం .. నన్నే నన్నే ముంచేస్తుందే

Oh my love .. Oh my love .. Oh my love my love !

వస్తావో రావో అంటూ సందేహం లో నేనున్నానే
కనిపించీ మురిపించాక కంగారవుతున్నానే

నీ అందం పూలచెట్టు కాదా
నీ పెదవే తేనెబొట్టు కాదా
నీ వయసే మాగ్నెట్టులాగా .. నన్నే లాగుతుందే !

నవ్వుల్లో సంధ్యారాగం .. ఈ రోజే వింటున్నా
ఎండల్లో శీతాకాలం .. నీవల్లేగా అనుకుంటున్నా !

Oh my love .. Oh my love .. Oh my love my love !

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా

ఈ రోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎంతో ముద్దొస్తోందే

ఆ చూపే టార్చ్ లైట్ కాదా
ఆ రూపం చాక్లెట్టు కాదా
తన చుట్టూ శాటిలైట్ లాగా .. మనసు తిరుగుతుందే !

జాబిల్లే నేలకు వచ్చీ .. నా ముందే నిలిచిందా
అదృష్ఠం నన్నే మెచ్చీ .. నిన్నే నాకు అందించిందా

Oh my love .. Oh my love .. Oh my love my love !

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాసంతం .. అవుతుందే నా సొంతం
ఎదనిండా ఆనందం .. నన్నే నన్నే ముంచేస్తుందే

Oh my love .. Oh my love .. Oh my love my love !



********************************************************************



సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం :భాస్కర్ భట్ల
గానం : గీతా మాధురి



నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

ప్రతి జన్మలోనా.... నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.... నచ్చావే..

ఓ నచ్చావే.. ...నచ్చావులే


అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేం లేదా నీకు నన్నే వదలవూ
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుందీ సీతాకోకలాగా


నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా



నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది
మనసునేమో దాచమన్న అస్సలేమీ దాచుకోదూ
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదూ
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా



నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావులే
నచ్చావే.. నచ్చావులే


************************************************************************




గానం : దీపు ,హర్షికా

 
ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా


చలి చలిగుందే మే నెల్లో
నడిచెస్తున్నా నిళ్ళల్లో
పడిపోతున్నా లొయల్లో నీవల్లె నీవల్లె
మనసా మనసా ఇది నీ మహిమా
కలిసీ కలిసీ నడిచే క్షణమా
ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా


 
ఒకరికి ఒకరని ముందే రాసే ఉంటుందంటే
కాదని ఎవరనుకున్నాసాక్షం మనమెలే

కన్నులు కన్నులు కలిసే గుప్పెడు గుండెను గెలిచే

మంత్రం ఎదొ ఉంది అది నాకే తెలియదులే
చెవిలో చెబుతాగ నువ్వొస్తే ఇలాగ
ఎదుటే ఉన్నాగా ఊరిస్తే ఎలాగ
నిను చుస్తు కుర్చుంటే బాగుందే భలేగా
ఈ అనందంలో ఎం చెబుతా ఆరో ప్రాణమా


ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా
 


వెన్నెల కురిసిన వేళ నిన్నే కలిసిన వేళ
ఝుమ్మని తుమ్మెద నాదం జడి వానై కురిసిందే
దెగ్గరగా నువ్వుంటే కబురులు చెబుతూ ఉంటే
రెక్కలు వచ్చి మనసే రెప రెప లాడిందే
చిరునవ్వుల చినుకుల్లొ తడిసానే స్వయానా
నా వెచ్చని కౌగిట్లొ చొటిస్తా సరేనా
ఎనలేని సంతోషం అంటారె ఇదేనా
నను ఉక్కిరి బిక్కిరి చేసావే హంపి శిల్పమా


ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హొగయా
ఓ ఓ చెలి నే పాగల్ అయిపొయా


చలి చలిగుందే మే నెల్లో
నడిచెస్తున్నా నిళ్ళల్లో
పడిపోతున్నా లొయల్లో నీవల్లె నీవల్లె
మనసా మనసా ఇది నీ మహిమా
కలిసీ కలిసీ నడిచే క్షణమా

************************************************************


గానం : దీపు , హర్షికా


ఓహో నేస్తమా నేస్తమా ఓహోహో నేస్తమా నేస్తమా
o my dear నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా


ఓహో నేస్తమా నేస్తమా ఓహోహో నేస్తమా నేస్తమా
o my dear నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా

రోజుకొక్క ప్లేసులోన ఊసులాడుకుందాం
పిచ్చి పిచ్చి మాటలెన్నో చెప్పుకుందాం
చిన్ని చిన్ని గొడవలొస్తే తిట్టికొట్టుకుందాం
అంతలోనె జోకులేసి నవ్వుకుందాం

ఓహో నేస్తమా నేస్తమా ఓహోహో నేస్తమా నేస్తమా
o my dear నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా


నాన్న జేబులో ఓ నోటు లేపుదాం
రెండు స్ట్రాలతో ఓ డ్రింకు తాగుదాం
కదులుతుండగా బస్సెక్కి దూకుదాం
మరింత క్లోజ్ గా మూవ్ అవుదాం
ట్రీట్ ఇచ్చుకుందాం వీకెండ్సులో
గీప్టులిచ్చుకుందాం మన మీటుంగ్సులో
ఇలా ఎప్పుడు మనం ఫ్రెండ్సులా ఉండేలాగ దేవుడిని వరం అడుగుదాం
 
ఓహో నేస్తమా నేస్తమా ఓహోహో నేస్తమా నేస్తమా
o my dear నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా

 
బైకు ఎక్కుదాం బిజీగా తిరుగుదాం
రంగు రంగులా లోకాన్ని వెతుకుదాం

అప్పుడప్పుడు అప్పిచ్చుకుందాం
తీర్చాల్సినప్పుడు తప్పించుకుందాం
don't say sorry ఫ్రెండ్షిప్పులో
thankyou లు లేవే మన మధ్యలో
నువ్వో అక్షరం నేనో అక్షరం
కలిపితేనే స్నేహమనే ఓ అర్ధం


ఓహో నేస్తమా నేస్తమా ఓహోహో నేస్తమా నేస్తమా
o my dear నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా
 

********************************************************************

గానం: రంజిత్


మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా


I am so sorry baby .....ఒ ఒ ఒ ఒ
I am really sorry baby .... ఒ ఒ ఒ ఒ ఒహో

ఓ చెలీ పొరపాటుకీ గుణపాఠమే ఇదా ఇదా
మౌనమే ఉరితాడులా విసిరెయ్యకే ఇలా ఇలా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
 
ఆ ఆ ఆ ...............................
 
నా వల్ల జరిగింది తప్పు నేనే మి చెయ్యాలో చెప్పు
పగపట్టీ పామల్లే నువ్వు బుస కొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి కారాలు మిరియాలు నూరి
ఏవేవో శాపాలు గట్రా పెట్టేయ్యకే
కాళ్ళా వేళ్ళా పడ్డా కూడా ఊరుకోవా
కుయ్యో మొర్రో అంటూ ఉన్నా అలక మానవా
అందం చందం అన్నీ ఉన్న సత్యభామా
పంతం పట్టీ వేధించకే నన్నువిలా


ఓహో చెలీ చిరునవ్వులే కురిపించవా ఓ హోహో
కాదనీ విదిలించకే బెదిరించకే ఇలా హోఓ


 
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
 


అరగుండు చేయించుకుంటా బ్లేడెట్టి కోసేసుకుంటా
కొరడాతో కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజీలే తీస్తా ఓంగొంగి దణ్ణాలే పెడతా
నూటొక్క టెంకాయ కొడతా దయ చూపవే
గుండేల్లో అంతో ఇంతో జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించవా
ఫ్రెండ్షిప్ అంటే అడపా దడపా గొడవే రాదా
సోరీ అన్నా సాధిస్తావే నన్నిలా


ఓ చెలీ ఎడబాటునే కలిగించకే ఇలా ఇలా
నన్నిలా ఏకాకిలా వదిలెళ్ళకే అలా అలా
 


మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా

January 01, 2009

కింగ్





Happy New Year and i dedicate this song for my Manmadhudu ;)














సంగితం : దేవీశ్రీ ప్రసాద్
గానం : సాగర్ ,దివ్య
సాహిత్యం : రామజొగయ్య శాస్త్రి

 


చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
 
కలుపుకోవా నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
 
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర


 
ఏరికోరి నీ ఎదపైన .....వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా

నింగి జారి తళుకుల వానా...... కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని ఇలా దరికి పిలుచుకోనా...హే
ఆడించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో

తెలుసులే అందమా నీ మనసులో సరిగమ

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర


 
 
ఆడ మనసులొ అభిలాష ......అచ్చ తెలుగులొ చదివేసా
అదుపు దాటి వరదయ్యింది ఈ చిలిపి చినుకు వరస ....హే

నన్ను నేను నీకొదిలేసా .......ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా


అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర