సాహిత్యం: కృష్ణ చైతన్య
సంగీతం: సత్య ప్రసాద్
గానం: కార్తీక్
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
తన ఊపిరి నను తడమగా .. ఇది మరణములే
చెలి అలకల చిరుకోపము .. ఇక కనపడదే
రాత రాసినా .. పైవాడు ఎవ్వడో
జాలి లేదులే .. నా పైన ఎందుకో
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
తడి ఆరని విడి విడి కన్నుల కధ ఇదిలే
తడబడి ఎద విలవిలమనె చెలి తలపులలో
కంటిపాపలా .. కన్నీటి పాటలా
రెప్పపాటులో .. ఏమైంది అంతలా
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ
**************************
సాహిత్యం: కృష్ణ చైతన్య
సంగీతం: అనిల్.ఆర్
గానం: నరేష్ అయ్యర్, రోహిత్
రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం
రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
వేకువా చీకటీ ఒకటై కలిసిన వేళా
పరువం మెల్లగా మాయలో మునిగిందా
ఎదురై నువ్విలా కలగనే కన్నుల్లో ఇదో కొత్త పరవశం
రెప్పపాటు ఈ క్షణం ..
రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
With you in my life I have seen it all girl !
ఊపిరే ఊసులై ఎదల్నే కలిపిన వేళా
రెప్పపాటు ఈ క్షణం ..
With you in my life I have seen it all girl !
దూరాలే దారి చూపి నిన్ను కలుపుతుంటే తెలిసింది ఇది ప్రేమనీ
రెప్పపాటు ఈ క్షణం ..
రెప్పపాటులో ..
రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం
రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
ఊపిరే ఊసులై ఎదల్నే కలిపిన వేళా
ఒకటై ఇద్దరం జగమే మరిచామే
కమ్మేసిందిలా నను అల్లుకోమంటూ చెలి వింత పరిమళం
ఇన్నాళ్ళు లేని హాయి నన్ను కలుసుకుంటే తెలిసింది ఇది ప్రేమనీ
రెప్పపాటు ఈ క్షణం ..
With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
With you in my life I have seen it all girl !
You in my Life .. my Life .. my lIfe
****************************************
సాహిత్యం: కృష్ణ చిన్ని
గానం: జావేద్ ఆలి, రమ్య
****************************************
సాహిత్యం: కృష్ణ చిన్ని
గానం: జావేద్ ఆలి, రమ్య
తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా
కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా
నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా !
నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా !
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా !
తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్నా
ఈ వాలినా పొద్దులో చీకటే .. ఆ వేకువై ఉదయమే వెలగదా !
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా
కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా
నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా !
నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా !
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా !
తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్నా
ఈ వాలినా పొద్దులో చీకటే .. ఆ వేకువై ఉదయమే వెలగదా !
No comments:
Post a Comment