December 09, 2010

ఆరెంజ్

సంగీతం: హరిస్ జయ్ రాజ్

సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!

ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే .. అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా !!!

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!

నిన్నే ఇలా .. చేరగా .. మాటే మార్చీ మాయే చెయ్యాలా
నన్నే ఇకా .. నన్నుగా .. ప్రేమంచనీ ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా .. ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా .. ఊరించేస్తూ అల్లేస్తుందే నీ సంకెలా

కొంచెం మధురము .. కొంచెం విరహము .. ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము .. కొంచెం శాంతము .. గొంతులో చాలు గరళం
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము .. గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము .. కొంచెం గానము .. ఎందుకీ ఇంద్రజాలం

ఇన్నాళ్ళుగా .. సాగినా .. ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో .. గుండెతో .. స్నేహం కోరీ వెళుతున్నా
ప్రేమనే .. దాహం తీర్చే .. సాయం కోసం వేచానిలా
ఒక్కోక్షణం .. ఆ సంతోషం .. నాతో పాటు సాగేదెలా ఎలా

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!

ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే .. అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా !!!

కొంచెం మధురము .. కొంచెం విరహము .. ఇంతలో నువ్వు నరకం
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము .. గుండెనే కోయు గాయం
కొంచెం మధురము .. కొంచెం విరహము ..
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము ..

************************************************

సాహిత్యం: వనమాలి

గానం: నరేష్ అయ్యర్

నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !

నువ్వే లేకుంటే .. ఏమౌతానో ..
నీ స్నేహాన్నే .. కావాలంటున్నానుగా .. కాదంటే నామీదొట్టుగా .. ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !!

ఒకసారి చూసి నే వలచానా .. నను వీడిపోదు ఏ మగువైనా .. ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాకా .. నువు పైకి తేలవే సులభంగా .. ప్రాణాలైనా ఇస్తా ఏకంగా

నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !

నిజాయితీ ఉన్నోడినీ .. నిజాలనే అన్నోడినీ .. అబద్దమే రుచించనీ అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ .. రొమాన్సులో పిచ్చోడినీ .. పర్లేదులే వప్పేసుకో సరేననీ
ముసుగేసుకోదు ఏ నాడూ .. నా మనసే ఓ భామా
నను నన్నుగానే చూపిస్తూ .. కాదన్నా పోరాడేదే నా ప్రేమా !

నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !

తిలోత్తమా తిలోత్తమా .. ప్రతీక్షణం విరోధమా .. ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా .. దివే అలా దిగొచ్చినా .. ఇలాంటీ ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా .. నా ముందూ పూరిల్లే
ఇకపై గొప్ప ప్రేమికుడై .. లోకంలో నిలిచే పేరే నాదేలే !

No comments: