March 12, 2010

వరుడు


సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సోనూ నిగం, శ్రేయా ఘోషాల్


బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !

అయినా కావచ్చులే .. ఒకటై పోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే .. యే దూరమైనా చేరువై


బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !

కనుపాపల్లో నిదురించీ .. కల దాటిందీ తొలి ప్రేమా
తొలి చూపుల్లో చిగురించీ .. మనసిమ్మందీ మన ప్రేమా


కలగన్నానూ .. కవినైనానూ .. నిను చూసీ
నిను చూసాకే .. నిజమైనానూ .. తెర తీసీ

బహుశా ఈ ఆమనీ .. పిలిచిందా రమ్మనీ
ఒకటైతే కమ్మనీ .. పల్లవే పాటగా !

అలలై రేగే అనురాగం .. అడిగిందేమో ఒడిచాటూ
ఎపుడూ ఏదో అనుభంధం .. తెలిసిందేమో ఒకమాటూ

మధుమాసాలే మన కోశాలై .. ఇటురానీ
మన ప్రాణాలే శతమానాలై .. జతకానీ

తొలిగా చూసానులే .. చెలిగా మారానులే
కలలే కన్నానులే .. కలిసే ఉన్నానులే
నా నీవులోనే నేనుగా !

బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !


*********************************

సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : హేమచంద్ర

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట

ఓ సఖీ నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలీ నా ప్రేమకీ ఉసురైనా కావే
ఒంటరీ ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నాదానా

మేఘ్హమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాల
అందుతూ చేజారినా చేమంతీ మాల
అందనీ దూరాలకే నువ్ పోనేల
తెగించాను నీ కోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయాన
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీ్తో ఏకం అవుతా ఏమైనా

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట


No comments: