February 10, 2009

ఆటోడ్రైవర్

సంగీతం: దేవా
గానం : హరిహరన్, సుజాత



చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా
చందమామా .. చందమామా .. సాయంత్రాల చక్కనమ్మా
వస్తావా..కలిసొస్తావా..కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా .. మనసిస్తావా .. కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే .. మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే .. మేఘాలెక్కడో

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటాలే
వీటికంటా రేగే మంటా చేస్తే ఉంటా నిన్నే జంటా చేసుకుంటాలే

ఊరించేటి అందాలన్నీ .. ఆ .. ఆ.. ఆ ..
ఊరించేటి అందాలన్నీ .. అరేసాక ఆరాతీసా
చీకట్లోని చిన్నందాలా .. చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయీ దాయి దాటి పోనీకులే

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

తుళ్ళీంతాడే గోదారల్లే ఏరూ నీరూ నీవూ నేనై పొంగిపోదామా
ఆ .. ఆ .. చుక్క కళ్ళ నీలాకాశం జబిల్లమ్మ జాడే ఉంటే పున్నమై పోదా
మల్లెగాలి పాడే లాలీ .. ఆ .. ఆ.. ఆ ..
మల్లెగాలి పాడే లాలీ .. గిల్లీ గింత పెట్టే వేళా
సన్నా జాజి సయ్యాటల్లో .. కన్నె మోజు చూసాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా అవుతా నీ జంటా
చెయి చేయి చేయి దాటి పోనీకు వాయీ

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

చందమామా .. చందమామా .. సాయంత్రాల చక్కనమ్మా
వస్తావా..కలిసొస్తావా..కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా .. మనసిస్తావా .. కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే .. మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే .. మేఘాలెక్కడో

ప్రేమికుడు

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ

గానం: ఉన్ని కృష్ణన్


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

ఈ పూటా .. చెలి నా మాటా .. ఇంక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే


ఇది స్వర్గమా .. నరకమా .. ఏమిటో తెలియదులే
ఈ జీవికీ .. జీవనమరణమూ .. నీ చెతిలో ఉన్నదిలే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోల పాడీ కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలిగాలులకి తెరచాపై నిలిచేనే


నా ఆశలా .. ఊసులే .. చెవిలోన చెబుతానే
నీ అడుగులా .. చెరగని గురుతులే .. ప్రేమ చరితను అంటానే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

అతడు

సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వ



అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే


ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే


Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter


కాలం నను తరిమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరం లో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ..
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ..
జడివానై నే కలబడతా..


పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!


తన ఎదలో పగ మేల్కొలుపుతూ..
వొది దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ..
చెలరేగే ఓ శరమతడూ..


Life started to be faster
Made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter


******************************************


సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ


తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం


కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో


అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో


మన సలహా మది వినదు కదా..
తెలుసు కదా .. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా చెలరేగాలా..


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం


సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా


తప్పుకో..కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంటా
వప్పుకో..నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా


నడపదుగా నిను నది వరదా..
తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా..ముంచెయ్యాలా !!


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ


తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !
**************************



సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహలక్ష్మి, రంజిత్



చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా


నో నో..ఇకసారిటు చూడూ..
నో నో .. నీ సొమ్మేం పోదూ..
నో నో.. ముద్దంటే చేదా.. ఆ .. ఆ
నో నో..నాతో మాటాడు..
నో నో..పోనీ పోటాడూ..
నో నో..సరదా పడరాదా..దా..దా..దా..దా


చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా

వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో


కల్లో వస్తే సర్లే గాని తల్లో
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో


దేఖోనా..సిగ్గుని కొద్దిగ సైడుకి నెట్టా..ఓకేనా ఏం బాగా లేనా
దాగేనా..కొంగుకు లొంగని సంగతులెన్నో..చూస్తున్నా వర్ణాల వాన


అంత గొప్పగా నచ్చానా..నో..నో
ఇంత చెప్పినా డౌటేనా..న న న నా
ఇల్లారా..కళ్ళారా..చూస్తావా ఇంకా..ఎన్నో..ఎన్నో..ఎన్నో


చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
కొమ్మల్లోని మొగ్గై ఉండే దానా..దానా..
నీలో చాలా విద్యే ఉందే జాణ..జాణ
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా..నిన్నా..
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా..తున్నా..


చిత్రం గా చందన చర్చలు చెయ్యకు నాతో..విన్నాలే శృంగార వీణా
తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే..కానీలే నే కాదన్నానా


ఊపిరాడదే నీ వళ్ళో .. నో నో
ఉండిపోకలా దూరం లో .. నో నో


ముస్తాబై వచ్చేవా..ముద్దిచ్చే ఉద్దేశం తో..ఆహా..ఆహా

చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
**************************************************


సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రమణ్యం



నీతో చెప్పనా .. నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా !
గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !!


నేనే నేనుగా .. లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నులా .. నీదే వెన్నెలా ఓ ఓ ఓ


నీతో చెప్పనా .. నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా !


ఇంకొంచం అనుకున్నా .. ఇకచాల్లే అన్నానా
వదలమంటె ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాలా పైపైనా .. పడతావేం పసికూనా
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా


మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి


గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !


ఒదిగున్నా ఒరలోనా .. కదిలించకె కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా
పెదవోపని పదునైనా .. పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా


సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి


గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !


నేనే నేనుగా .. లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
ఓ .. నా కన్నులా .. నీదే వెన్నెలా ఓ ఓ ఓ


****************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషల్


పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో .. వాకిళ్ళలో
వెవేల వర్ణాల వయ్యారి జాణ


అందమైన సిరివానా .. ముచ్చటగ మెరిసే సమయానా
అందరాని చంద్రుడైనా .. మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా


మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యేనా


చందనాలు చిలికేనా .. ముంగిళ్ళో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా .. మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా


నవ్వుల్లొ హాయి రాగం
మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం
ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం


పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజానా


చెంగు మంటు ఆడేనా .. చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా .. మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా


****************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: కవితా కృష్ణమూర్తి, కార్తీక్



పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !


తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ ఉంటావా
ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !!


సమయం .. కాదంటావా
సరదా .. లేదంటావా
సరసం .. చేదంటావా బావా !


చనువే .. తగదంటావా
మనవే .. విననంటావా
వరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా !


డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హేయ్ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా


కలలుంటే సొగసే కనపడదా.. మనసుంటే తగు మార్గం దొరకదా
రాననకా .. రాననకా .. రాననకా ..
అనుకుంటే సరిపోదే వనితా .. అటుపై ఏ పొరబాటో జరగదా
రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా ..


పెరిగిన దాహం తరగదే .. పెదువుల తాకందే
తరిమిన తాపం తాళదే .. మదనుడి బాణం తగిలితే


చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే !


Break it down !

హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !


పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !


మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా
చేరవుగా .. చేరవుగా .. చేరవుగా ..
ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా
ఆగవుగా .. ఆగవుగా ..ఆగవుగా ..


దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా


వరాల బాలా వరించువేళా .. వరించనంటూ తగువేలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా


Everybody ..

నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా

మన్మధుడు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి, వేణు




గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
ఓ మనసా !

పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ
నువ్వు ఇపుడన్నదీ నేనెప్పుడూ విననిదీ
నిన్నిలా చూసి పయనించి .. వెన్నెలే చిన్నబోతుంది
కన్నులే దాటి కలలన్ని .. ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో .. ఇదంతా .. నిజంగా కలలాగే ఉంది !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నదీ
ఎక్కడా జరగనీ వింతేమి కాదే ఇదీ
పరిమళం వెంట పయనించీ .. పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ .. పరిచయం తోడు కోరింది

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
ఓ మనసా !



****************************************


గానం: ఎస్.పి.చరణ్


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా (2)


పూల చెట్టు ఊగినట్టు .. పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు .. వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరేనువ్వు


నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా...ఓ .. హొ .. హో .. ఓ !


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


చుట్టుపక్కలెందరున్నా .. గుర్తు పట్టలేక వున్నా
అంత మంది ఒక్కలాగే కనబడతుంటే
తప్పు నాది కాదు అన్నా .. ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజం ఏదో నాకు వింతే


కళ్ళను ఒదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..ఓ .. హొ .. హో .. ఓ !


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


***************************************

సాహిత్యం: భువనచంద్ర
గానం: దేవిశ్రీ ప్రసాద్



హే .. అందమైన భామలూ
అరె లేత మెరుపు తీగలూ
హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు


అరె సిల్క్ చుడీదారులూ .. కాజీవరం చీరెలూ
రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


Oh baby just give me love
Oh baby just take it now (2)


హే నువ్వేనా నా కల్లోకొచ్చిందీ
నా మనసంతా తెగ అల్లరి చేసిందీ
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్ నా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్ నా

హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా

హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)
హేయ్ .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ


Oh baby just give me love
Oh baby just take it now
Oh baby I wannit now
Oh baby take it right now


హేయ్ కల్యాణీ నచ్చిందే నీ ఓణీ ..నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకీ వేసెయ్ నా గాలాన్ని
నీ వొంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వే మిన్న కద సుకుమారీ


హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


హే .. అందమైన భామలూ
అరె లేత మెరుపు తీగలూ
హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు


హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)

హృదయాంజలి

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర




మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


మానసవీణా .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పచ్చదనాలా .. పానుపు పైనా ..అమ్మై నేలా జో కొడుతుంటే
పచ్చదనాలా .. పానుపు పైనా ..అమ్మై నేలా జో కొడుతుంటే


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పున్నమి నదిలో విహరించాలి .. పువ్వుల వళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి .. తొలకరిజల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ
వేకువ వెనువెంట నేలకి తరలీ
కొత్త స్వేచ్చకందించాలి .. నా హృదయాంజలీ !


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


తూగే ..
వాగునా నేస్తం చెలరేగే ..
వేగమే ఇష్ఠం అలలాగే ..
నింగికే నిత్యం ఎదురేగే ..
పంతమే ఎపుడూ నా సొంతం (2)


ఊహకు నీవే .. ఊపిరి పోసీ .. చూపవే దారీ ఓ చిరుగాలీ
కలలకు సైతం .. సంకెల వేసీ .. కలిమి ఎడారీ దాటించాలీ
తుంటరి తూనీగనై తిరగాలీ
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళీ
పేద గరిక పూలకు ఇస్తా .. నా హృదయాంజలీ !


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం
మానసవీణా .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పచ్చదనాలా .. పానుపు పైనా .. అమ్మై నేలా జో కొడుతుంటే
పచ్చదనాలా .. పానుపు పైనా .. అమ్మై నేలా జో కొడుతుంటే
మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం !


తూగే ..
వాగునా నేస్తం చెలరేగే ..
వేగమే ఇష్ఠం అలలాగే ..
నింగికే నిత్యం ఎదురేగే ..
పంతమే ఎపుడూ నా సొంతం !