February 15, 2013

మిర్చి




సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: విజయ్ ప్రకాష్, అనిత

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
లాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగ ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీవైపొస్తుందే

ఇదేదో బాగుందే చెలీ .. ఇదేనా ప్రేమంటే మరీ !
ఇదేదో బాగుందే చెలీ .. ఇదేనా ప్రేమంటే మరీ !!

నీమతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీకష్ఠం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరీ .. ఇదే ప్రేమనుకుంటే సరీ !
ఇదేదో బాగుందే మరీ .. ఇదే ప్రేమనుకుంటే సరీ !!

తెలుసుకుంటావా .. తెలుపమంటావా .. మనసు అంచుల్లో నుంచున్న నా కలనీ
ఎదురుచూస్తున్నా .. ఎదుటనే ఉన్నా .. బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్నీ

వేల గొంతుల్లోన మ్రోగిందే మౌనం .. నువ్వున్న చోటే నేననీ
చూసి చూడంగానే చూపిందే ప్రాణం .. నేనీదాన్నై పోయాననీ

ఇదేదో బాగుందే చెలీ .. ఇదేనా ప్రేమంటే మరీ !
ఇదేదో బాగుందే మరీ .. ఇదే ప్రేమనుకుంటే సరీ !!

తరచి చూస్తూనే .. తరగనంటున్నా .. తళుకు వర్ణాల నీ మేను పూవలనీ
నలిగిపోతూనే .. వెలిగిపోతున్నా .. తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ

కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారీ .. నిన్నే తీరేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరీ .. నీకోసం ఏదైనా సరే

ఇదేదో బాగుందే చెలీ .. ఇదేనా ప్రేమంటే మరీ !
ఇదేదో బాగుందే మరీ .. ఇదే ప్రేమనుకుంటే సరీ !!

1 comment:

Hari Gottipati said...

Venu,
You should post the songs on a regular basis. Almost a year gap between this song and your last song.