Powered by eSnips.com |
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్
నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా (2)
తూనీగా రెక్కలే పల్లకీగా .. ఊరేగే ఊహలే ఆపడం నా తరమా
నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా
ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ .. ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ .. విరిసే పొదలూ .. నా ఎదకూ ఆమెనే చూపినవి
నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా
మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ .. నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి
ఈ జతలో .. ఒకడై ఒదిగే .. ఓ వరమే చాలదా ఎన్నటికీ
నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా
****************************
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : హరిచరణ్
తీసే ప్రతి శ్వాసా .. తన తలపౌతున్నదీ
తీసే ప్రతి శ్వాసా తన తలపౌతున్నదీ
జారే ప్రతి ఆశా జత అడుగేదన్నదీ
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ
కలవో లేవో కనలేని ప్రేమా !
కను చూపు ఎటు వాలుతున్నా .. తన రూపు కదలాడుతోందా
ప్రతి గాలి తన లాలి పాటైనదా
కన్నీటి అల తాకుతుంటే .. ఈ కంటి కల కరుగుతోందా
ప్రతి మలుపు తను లేని బాటైనదా
హే ఆ పాశమే నేడు .. ఆవేదనౌతోందా
ఏ దారి కనరాక ఎదురీదుతూ ఉందా
ఈ పాదమీ వేళా ఏకాకి లా మల్లే
ఏ దరికి చేరాలో ఎదనడుగుతుందా
తొలి ప్రేమ గుండెలను తొలిచేస్తు ఉన్నదా
తొలి ప్రేమ గుండెలను తొలిచేస్తు ఉన్నదా
కలవో లేవో కనలేని ప్రేమా !
No comments:
Post a Comment