Powered by eSnips.com |
సంగీతం: మణిశర్మ
గానం: రంజిత్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
పిల్లా లేదు పెళ్ళీ లేదు .. పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు .. ఏక్ నిరంజన్ !!
ఊరే లేదు .. నాకూ పేరే లేదు .. నీడ అలేదు .. నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను .. ఎక్కిళ్ళే రావసలే
నాకంటూ ఎవరూ లేరే .. కన్నీళ్ళే లేవులే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !
అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
పిల్లా లేదు పెళ్ళీ లేదు .. పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు .. ఏక్ నిరంజన్ !!
కేరాఫ్ ప్లాట్ఫాం .. సన్నాఫ్ బాడ్ టైం .. ఆవారా డాట్ కాం
హే దమ్మర దం .. టన్స్ ఆఫ్ ఫ్రీడం .. మనకదేగా ప్రాబ్లం
అరె డేటాఫ్ బర్తే తెలియదే .. నే గాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే .. నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !
అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
తట్టా లేదు బుట్టా లేదు .. బుట్ట కింద గుడ్డు పెట్టే పెట్టా లేదు .. ఏక్ నిరంజన్ !!
దిల్లిష్ బాడీ ఫుల్లాఫ్ ఫీలింగ్ నో వన్ ఈజ్ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ
రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడానే లేదేలే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !
అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
కిస్సూ లేదు మిస్సూ లేదు .. కస్సు బుస్సు లాడే లస్కూ లేదు .. ఏక్ నిరంజన్ !!
******************************************************
గానం: మాళవిక
సాహిత్యం : భాస్కరభట్ల
సంగీతం : మణిశర్మ
ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
ఎపుడూ ఒంటరి అనకూ .. నీతోనే చావూ బ్రతుకూ
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకూ
ప్రేమతోటి చెంప నిమరనా ..గుండే చాటు బాధ చెరపనా
నీ ఊపిరే అవ్వనా !
గడిచిన కాలమేదో గాయపరిచినా .. జ్ఞాపకాల చేదు మిగిలినా
మైమరపించే హాయవ్వనా !
ఒట్టేసి నేను చెబుతున్నా .. వదిలుండలేను క్షణమైనా
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా !!
ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ..
నా మనసే నీకివ్వనా .. నీలోనే సగమవ్వనా
అరచేతులు కలిపే చెలిమే నేనవనా
ముద్దుల్లో ముంచేయనా .. కౌగిలిలో దాచెయ్యనా
నా కన్నా ఇష్ఠం నువ్వే అంటున్నా
దరికొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా !
ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
నిను పిలిచే పిలుపవ్వనా .. నిను వెతికే చూపవ్వనా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా
నిను తలచే తలపవ్వనా .. నీ కధలో మలుపవ్వనా
ఏడడుగుల బంధం నీతో అనుకోనా
మనసంతా దిగులైతే .. నిను ఎత్తుకు సముదాయించనా
నీ కోసం తపనపడే .. నీ అమ్మా నాన్నా అన్నీ నేనవనా !
ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
**********************************
గానం: హేమచంద్ర, గీతా మాధురి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ
గుండెల్లో .. గుండెల్లో
గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే
చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే
చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేసావే
??? నా మైండంతా లాగేసావే
లెఫ్ట్ రైట్ టాప్ టు బాటం నచ్చేసావే
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే
గుండెల్లో ..
గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే
చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే
సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే
ఎర వేసి వల్లోకి నను లాగేసిందీ నువ్వే
ఖాళీ దిల్లోనా దేవతలా దిగిపోయావే
తెరతీసే సరదాకీ పిలుపందించిందీ నువ్వే
అనుకోకున్నా నకన్నీ నువ్వైపోయావే
ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే
నరనరాల ఏక్ తార వినిపించావే
నా స్వరాన ప్రేమ పాట పలికించావే
గుండెల్లో ..
గుండెల్లో ..
నా కేవేవో ..
చూపుల్తో ..
నీ మాటల్తో ..
యమ్మా ఏం ఫిగరో తెగ హాటనిపించేసావే
నువు కూడా పిలగాడా నన్నెంతో కదిలించావే
జియా జిజారే చెయి వాటం చూపించావే
నువు కూడా నన్నేరా ఇట్టాగే దోచేసావే
కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే
ఎదలోయల్లో చిరుజల్లై నను తడిపేసావే
అందమైన మత్తుమందు నువ్వే నువ్వే
అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే
గుండెల్లో ..
గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే
చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే
గుండెల్లో .. గుండెల్లో
************************
గానం: కార్తీక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ
సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..
ఒక్కసారి ఐ లవ్ యూ అనవే సచ్చిపోతా
ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా
నువ్వొక్కసారి 143 అనవే రాలిపోతా
నీ లవ్వు కన్న లక్కేదీ లేదని రేగిపోతా
యహ సైట్లు ఏ కోట్లు వద్దు నా కోహినూరు నువ్వంటా
ఏ పాట్లు రాని అగచాట్లు రాని నీ ప్రేమతో బ్రతికేస్తా
నిను దేవతల్లే పూజిస్తా
ఓ దెయ్యమల్లే సాధిస్తా
నువ్వు లొంగనంటే ఏం చేస్తా
నే బ్రహ్మచారిగా పుచ్చిపోతా
సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..
నీ ఇంటిముందు టెంటు వేసుకుంటా .. మైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా
అప్పుడైనా తిట్టుకుంటు చెప్పవే ఐ లవ్ యూ !
వీధి వీధి పాదయాత్ర చేస్తా .. సంతకాలు లక్ష సేకరిస్తా
అందుకైనా మెచ్చుకుంటు అనవే 1..4..3
అసలెందుకంట నేనంటే మంట తెగ చిటపటమంటావే
కొవ్వున్న చోట లవ్వుంటదంట అది నిజమని అనుకోవే
బతి మాలీ గతి మాలీ అడిగా నిన్నే
సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..
దండమెట్టి నిన్ను కాక పడతా .. దండలేసి కోకనట్సు కొడతా
వెయ్యి పేర్లు దండకాలు చదువుతూ ప్రేమిస్తా !
తిండి మాని బక్కచిక్కిపోతా .. మందు దమ్ము అన్ని మానుకుంటా
ఏడుకొండలెక్కి గుండుకొడతా ఏటేటా
నీకోసమింత నే చేస్తున్నదంత నువు చూసీ చూడవుగా
ఏ మాయసంత అని తిప్పుకుంటూ పోతే నే వదలనుగా
వెనకొస్తా.. విసిగిస్తా .. నువు మారేదాకా
1 comment:
ముఖ్యమైన పాటల రచయత పేరు ప్రతీ పాటకి రాస్తే బావుంటుంది.
Post a Comment