Sare Nee Ishtam-Ne... |
సంగీతం : చక్రీ
గానం : హరీష్ రాఘవేంద్ర
సాహిత్యం : కందికొండ
నీవల్లే నీవల్లే...... స్వప్నాలే కన్నాలే
నీలాల కన్నుల్లో .......నీ రూపే నిండేలే
చెలిమివి నీవే అనుకున్నా
చెరగని ప్రేమే కనుగొన్నా
నువు నడిచే ఆ ప్రతీ అడుగై నీ వెంటే ఉన్నా
నువు పీల్చే నీ ఊపిరినై ఎద సడినే విన్నా
నీవల్లే నీవల్లే .......స్వప్నాలే కన్నాలే
మనసున నిలిచెను ఒక తలపే
మరి మరి పిలిచెను తన వైపే
చిరు చిరు గుస గుస ఇక జరిపే
చిటపట చినుకులై నను తడిపే
కురిసెను మధువై మైనా మదిపైనా
విరిసెను తొలి తొలి ప్రేమ ఎదలయ తడబడి లోన
ఇది కలయో నిజమో కలవరమో వరమో
అది మహిమో పరవశమో ఎగిసిన కలకలమో
నీవల్లే నీవల్లే...... స్వప్నాలే కన్నాలే
ఎదురుగ నిలబడి చెలి ఉంటే
జగమును క్షణమున మది మరిచే
గలగల ఊసులు నువు చెబితే
అవి విని చిలిపిగ ఎద మురిసే
కలిసెను స్వర్గమే నీలా దిగులేలా
విడువక జత పడిపోవా అడుగున అడుగిడి రావా
ఒక చెలిమే దొరికే ఎద అలలై ఎగిసే
సఖి ఎదుటే హృది నిలిచే అలసట అది విడిచే
నీవల్లే నీవల్లే...... స్వప్నాలే కన్నాలే
నీలాల కన్నుల్లో .......నీ రూపే నిండేలే
No comments:
Post a Comment